నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండల శివారులోని జనపల్లి లో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిషేధిత మత్తు పదార్థం అల్ఫ్ర జొలoను పట్టుకున్నారు. శనివారం మధ్యాహ్నం విశ్వసనీయ సమాచారం మేరకు కృత్రిమ కల్లు తయారీలో వాడేందుకు సిద్ధంగా ఉంచిన అల్ఫ్రా జోలం పట్టుకున్నారు. నిషేధ మత్తుపదార్థాన్ని కలిగి ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
