. . . బాలల చదువు భవిష్యత్ కి వెలుగు
లింగంపేట్, బతుకమ్మ :
బాలల చదువు భవిష్యత్తుకు వెలుగు అని బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి సూచించారు. బుధవారం బోనాల్ తాండ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసాన్ని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శోభారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా శోభారాణి మాట్లాడుతూ బాలల చదువు భవిష్యత్ కి వెలుగు అన్నారు. ప్రభుత్వం పాఠశాలలో అందిస్తున్న ఉచిత వసతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండ హాజరు కావాలని విద్యార్థులకు ప్రేరణ కల్పిచారు. విద్య తో పాటు విద్యార్థులకు ఆట పాటల తో ఆహ్లాద వాతావరణం కలిగించి హాజరు నమోదు శాతం పెంచాలన్నారు. విద్యార్థులను బెస్ లైన్ టెస్ట్ కి సంసిద్దం చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రజనిప్రియ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ సత్యనారాయణ, ఉపాధ్యారాలు రమాదేవి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
