వెబ్ న్యూస్,బతుకమ్మ : పార్టీనీ బలపరచుకోవడానికి ఏఐఏడీఎంకే కొత్త వ్యూహం వేసింది. పార్టీ నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మార్చి 5న తిరుపూర్ జిల్లా ఉత్తుకులిలో అన్నాడీఎంకే మహాసభ జరగనుంది. సభలో పాల్గొనే ముగ్గురికి లాటరీ పద్ధతిలో బంగారు నాణెలు, 300 మందికి గృహోపకరణాలు అందజేస్తామని వెల్లడించింది. గతంలో ఓ సభలో ప్లాస్టిక్ కుర్చీలను ఏడీఎంకే నేతలు ఇచ్చిన విషయం తెలిసిందే.
