బతుకమ్మ , బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ మెడికల్ స్టోర్ ను ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పోచారం శంభూ రెడ్డి లు ప్రారంభించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని, వినియోగదారుల మన్ననలు పొందాలని వారు సూచించారు. యువత స్వయం కృషితో ఎదిగేందుకు వ్యాపార రంగాలలో రావడం అభినందనీయమన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాదర్, కామారెడ్డి జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఖలేక్, నాయకులు ఎజాస్, అంజి రెడ్డి, కృష్ణరెడ్డి,దావుద్,గుడల నగేష్, హకీమ్, మధుసుదన్ రెడ్డి, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు…
