. . . కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిర శోభన్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుండేదని కెసిఆర్ వచ్చాక రాష్ట్రమును అప్పుల తెలంగాణగా మార్చారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిర శోభన్ విమర్శలు చేశారు. శుక్రవారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి పక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాకుండా ప్రజాధనం వృధా చేసున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని ఇప్పటి వరకు దాదాపు 24కోట్లు ఖర్చు చేసారని, కేవలం 1000రోజుల్లో 3రోజులు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉండటం మనకు సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులను కడ్తూ, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందని ఇవి ప్రతి పక్ష నాయకులకు కనపడట్లేదా అని ప్రశ్నించారు? తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలకు కెసిఆర్ గురించి బీఆర్ఎస్ గురించి తెలిసేలా కాంగ్రెస్ నాయకులు వివరించాలన్నారు.1000రోజుల పాలనను అసెంబ్లీలో చర్చ్చిస్తారానే ఉద్దేశ్యంతో కేటీఆర్, హరీష్ రావ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ముందు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించరని, స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసారని, మహిళా పోలీసుల ముందు చొక్కాలు విప్పి నీచంగా ప్రవర్థించరాని, ఇటువంటి వాటిని తెలంగాణ సమాజం క్షమించదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితమ్మ, సునీత లక్ష్మరెడ్డి, కోవా లక్ష్మి లను అడ్డం పెట్టుకొని బిఆర్ ఎస్ డ్రామాలు చేస్తుందని, వీళ్ళు ఒక్కపుడు కాంగ్రెస్ పార్టీలో అధికారం అనుభవించి కారు పార్టి లోకి వెళ్లారని, ఇప్పటికయినా వీళ్ళు గులాబి పార్టి మాయలో పడి తెలంగాణ ప్రజలకు మోసం చేయకుండా ఉండాలని తెలిపారు.రాష్ట్రలో అనేక సార్లు బిఆర్ఎస్ పార్టీ దళితులను అన్ని రకాలుగా మోసం చేస్తూనే ఉందని, అ పార్టీకి దళితులు తగిన గుణ పాఠం చెబుతారన్నారు.

ఈ సందర్బంగా డిసిసి అధ్యక్షుడు నగేష్ రెడ్డి మాట్లాడ్తూ మా ప్రభుత్వం వచ్చి సుమారు 1000రోజులు పూర్తి అయినది.దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసామో అవి తుచా తప్పకుండ అమలు చేసాం.మరి ఫార్మ్ హౌస్ లో పడుకున్న కెసిఆర్ మా పార్టీ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకంగా నినాదాలు, ధర్నాలు చేయండి అని పిలుపునివ్వడం అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో కెసిఆర్ సూచనల మేరకు ఒక పక్కన అల్లుడు, కుమారుడు వారి ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు కలిసి మన స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, మహిళల ముందు చొక్కాలు విప్పుకొని అసభ్యకరంగా ప్రవర్తించినందుకు ఎమ్మెల్సీలు నవీన్ రెడ్డి , తాత మధు లపై సస్పెండ్ చేయడం జరిగిందన్నారు.స్పీకర్ ని అవమానించినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. కెసిఆర్ ని నిద్రలేపెందుకు మా నాయకులు నర్సారెడ్డి 1000డప్పులతో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ ప్రదేశంను పసుపు నీళ్లతో శుభ్రం చేయడం దొరల అహంకారని తెలియజేస్తుందని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కి రాష్ట్రలో పుట్టగతులు ఉండవని ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శరత్, రత్నాకర్ గౌడ్, గాదారి గోపి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ గౌడ్, బున్నే రవిందర్, జిల్లా ST సెల్ అధ్యక్షులు యాదగిరి, సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, sc సెల్ అధ్యక్షులు లింగం, ఫిషిరీస్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా కోశాధికారి భక్త వత్సలం, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, పోల ఉషా, స్వప్న, మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్, రఘు, సాయికుమార్, గణేష్, సుభాష్, రవి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
