29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

భూ భారతి చట్ట ప్రకారం చర్యలు

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి బతుకమ్మ : ఈనెల 14 నుంచి మీ సేవా కేంద్రంలో భూ సమస్యలపై దరఖాస్తు సమర్పిస్తే భూ భారతి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, భూ భారతి చట్టం పై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. భూ భారతి చట్టం పై అవగాహన సదస్సులను  జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా సోమవారం నిజాంసాగర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో, మహమ్మద్నగర్ రైతువేదికలో, బాన్సువాడ రెడ్డి సంఘంలో నిర్వహించిన అవగాహన సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ భారతి చట్టం 14 ఏప్రిల్ 2025 న ప్రారంభించడం జరిగిందని . చట్టం పై ప్రజలకు, రైతులకు అవగాహన సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ధరణీ స్తానంలో భూ భారతి భూమి హక్కుల చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇందులో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డులలో తప్పుల సవరణ చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందని, 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదా బైనామ ద్వారా కొనుగోలు చేసిhలో క్రమబద్దీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓ లు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్ , స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు. అట్టి వాటిని రికార్డు లలో నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారని తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు. పాసు పుస్తకాలలో భూమి పటం, భూముల సమస్యలు పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్త ఉంటుందని తెలిపారు. తహసీల్దార్ చేసిన మ్యుటేషన్లపై లేదా జారీచేసిన పాసుపుస్తకాలపై  అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ కు అప్పీలు చేసుకోవచ్చని, ఆర్డీఓ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్ కు అప్పీలు చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ తరహాలో రైతులకు భూదార్ కార్డుల జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి చట్టంలో ఏమైనా అభ్యంతరాలు, అనుమానాలు ఇంతే నివృత్త చేసుకోవచ్చని తెలిపారు. గతంలో ధరణీలో అప్పీలు కు ఆస్కారం లేనందున సివిల్ కోర్టుకు వెళ్ళవలసి ఉండేదని, ప్రస్తుతం తహసీల్దార్ ఇచ్చిన తీర్పులో అభ్యంతరం ఉంటే ఆర్డీఓ కు, ఆర్డీఓ తీర్పులో అభ్యంతరం ఉంటే కలెక్టర్ కు అప్పీలు. చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పు అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. హక్కుల రికార్డుల్లో ఉన్న వ్యక్తి లైసెన్సు గల సర్వేయర్ తో భూమి సర్వే చేయించుకొని మ్యాప్ తయారు చేయించుకున్నట్లయితే మండల సర్వేయర్ సరి చూసిన తర్వాత తహసీల్దార్ పాసుపుస్తమలో సర్వే మ్యాప్ ను ఉంచడం జరుగుతుందన్నారు. ఏ మైన భూ సమస్య ఉంటే సదరు పార్టీలకు నోటీసులు జారీ చేయాలని ఎవిడెన్స్ రికార్డు చేయాలనీ స్పీకింగ్ ఆర్డర్స్ స్పష్టమైన రీమార్కులతో నమోదు చేయాలని తెలిపారు. ప్రస్తుతం మీ సేవలో దరఖాస్తు పెడితే భూ భారతి చట్ట ప్రకారం విచారణ చేపట్టి నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలపై విచారణ చేసి స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భూ భారతి చట్టం లింగంపేట్ మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు జరుగుచున్నదని తెలిపారు. ప్రజలందరూ భూ భారతి పై అవగాహన కల్పించుకోవాలని అన్నారు.

Actions under the Bhu Bharati Act

జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంత రావు మాట్లాడుతూ, గడిచిన కాలంలో భూమి కోసం పోరాటాలు జరిగాయని వివరించారు. భూముల వివరాలు కాగితాలపై ఒక లెక్క, ఫిజికల్ గా మరో లెక్క ఉండేవన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు. జియో ట్యాగింగ్ చేసి భూదార్ కార్డ్ జారీచేయడం జరుగుతుందని తెలిపారు. సాధాబైనామా దరఖాస్తులను పరిశీలించి విచారణా చేసి న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. ధరణీ వలన రైతుల ప్రాణాలు పోయాయని తెలిపారు. ఎవరి భూమి వారికే చెందడానికి భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని వివరించారు. కొత్త చట్టాన్ని ప్రతీ ఒక్కరు అవగాహన కల్పించుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జుక్కల్ నియోజక వర్గంలో దళారుల ప్రమేయం ఉండకూడదని, అలా చేసిన పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ను కోరారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరగకూడదని పేర్కొన్నారు. సదస్సులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్, బాన్సువాడ మున్సిపల్ కమీషనర్ శ్రీహరి, ఆయా మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, రెవిన్యూ సిబ్బంది, గ్రామస్తులు, రైతులు, పలువురు ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

Actions under the Bhu Bharati Act

More articles

Latest article