- ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం
నిజామామాద్ సిటీ, బతుకమ్మ : శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం నిజాంబాద్ నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్ లో గల నేషనల్ మార్ట్ వెనుకాల శ్రీ చైతన్య (CBSE) పేరుతో విద్యాశాఖ నుండి ఎటువంటి అనుమతి లేకుండా బిల్డింగ్ పూర్తి కాకముందే అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని శ్రీ చైతన్య స్కూల్ బిల్డింగ్ ముందట ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ కు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని శ్రీ చైతన్య విద్యాసంస్థకు విద్యాశాఖ నుండి ఎటువంటి అనుమతి లేకుండా బిల్డింగ్ పూర్తి కాకముందే సిబిఎస్సి పేరుతోటి అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు మోసం చేస్తూ లక్ష రూపాయల నుండి 1,50,000 వరకు ఫీజు వసూలు చేస్తున్నారని తెలిపారు.

దాంతోపాటు 2025 _26 సంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ నుండి అనుమతి లేకపోయినా బ్రోచర్లు ప్రింట్ చేసి అడ్మిషన్లు నిర్వహించారని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు శ్రీ చైతన్య విద్యా సంస్థ చర్యలు తీసుకోకుండా యజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం పట్ల ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి శ్రీ చైతన్య విద్యాసంస్థల యజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేసి ఆ బిల్డింగ్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గతంలో మాదిరిగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు అంజలి, జిల్లా నాయకులు కుషాల్, కార్తీక్, నవీన్ కృష్ణ ,ప్రదీప్, టోకు, మైపాల్, లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

