. . . టీఎస్ఎ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాలా
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పాఠశాలలను నడిపేందుకు అనుమతి లేకుండానే అడ్మిషన్లు చేపడుతున్న పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీఎస్ఎ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాలా అన్నారు. ఈ విషయమై గురువారం జిల్లా విద్యాధికారి అశోక్ కుమార్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జ్వాలా మాట్లాడుతూ నగరంలో సుభాష్ నగర్ లో మూడు, వినాయక్ నగర్ లో మూడు, కంఠేశ్వర్ లో రెండు, ఖిల్లా ప్రాంతంలో ఒక స్కూల్ ఎటువంటి అనుమతి లేకుండా నడుపుతున్నారని తెలిపారు. నగరంలో ఎక్కడా చూసినా హోర్డింగ్స్ పెడుతూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తూ ఫీజులు గుంజుతున్నారని అన్నారు. సమ్మర్ క్యాంప్ పేరిట అడ్మిషన్స్ చేపడుతూ విద్యార్థులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. తక్షణమే ఎటువంటి అనుమతి లేకుండా నడుపుతున్న ఈ 9 పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆమె డీఈఓ ని కోరారు. దీనిపై స్పందించిన డీఈఓ తక్షణమే ఆ పాఠశాలలకు నోటీసులు ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు.
