29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రైవేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి : టీఎన్ఎస్ఎఫ్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో ఫీజులు చేల్లిస్తేనే పరీక్ష ఫీజులు తీసుకుంటున్నారని, అలాంటి కాలేజీలపై చర్యలు తీసుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్ మీడియెట్ అధికారికి వినతి పత్రం అందజేశారు. కాలేజీ ఫీజులు కట్టడానికి హాల్ టికెట్ వచ్చే వరకు గడువు ఇవ్వాలని, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నారని అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. అలాంటి కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ అబ్బాస్, పలాటి రాజేష్, షేక్ ఫైజాన్ పాల్గొన్నారు.

More articles

Latest article