29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆచార్య రాంబాబు గోపిశెట్టికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం కామర్స్ విభాగం  ఆచార్య రాంబాబు గోపిశెట్టికి  తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు లభించింది.  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని శిల్పారామం లో జరిగిన  గురుపూజోత్సవ కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ యోగితా రానా అధ్యక్షత వహించగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఏనుముల రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా,ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు ఆచార్య బాలకృష్ణారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, శాసనమండలి సభ్యులు  వివిధ విశ్వవిద్యాలయాల వైస్  ఛాన్స్లర్లు  అతిథులుగా  హాజరై ఉపాధ్యాయ దినోత్సవం ప్రాధాన్యత గురించి  ప్రసంగించారు.  అనంతరం  తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఆచార్య రాంబాబు గోపిశెట్టి ని  శాలువా, మెమొంటో పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ప్రోత్సాహకంగా నగదు పారితోషకం పదివేల రూపాయలు అందజేశారు.

More articles

Latest article