మూడుతరాల ఉద్యమ శీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ
బతుకమ్మ, బిచ్కుంద : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మూడుతరాల ఉద్యమశీలని, తెలంగాణ ప్రజల హక్కుల కోసం జీవితాంతం కృషి చేశారని, ఆయన చూపించిన మార్గం ఇప్పటికీ స్ఫూర్తిదాయకమని బాన్సువాడ డివిజన్ పద్మశాలి సంఘం అధ్యక్షులు డాక్టర్ రాజు అన్నారు. శనివారం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ...బడుగు, బలహీన వర్గాల...