పీఎంశ్రీ నిధులపై ఏసీబీ నజర్

0 15,457
  • నవీపేట్ కేజీబీవీలో సోదాలు

 

నిజామాబాద్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థల్లో అభివ`ద్ది కోసం ఇస్తున్న పీఎంశ్రీ నిధుల వినియోగంలో అవినీతి, అక్రమాలపై ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ ద`ష్టి సారించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పీఎంశ్రీ నిధుల గురించి విద్యా శాఖ నుంచి వివరాలు సేకరించిన విషయం తెలిసిందే. తాజాగా పీఎంశ్రీ నిధులు మంజూరైన పాఠశాలల్లో కేజీబీవీల్లో క్షేత్రస్థాయిలో పర్యటన ప్రారంభించింది. అందులో భాగంగా మంగళవారం నవీపేట్ కేజీబీవీ పిఎంశ్రీ నిధులు నామ్స్ ప్రకారంగా ఖర్చులపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. పిఎంశ్రీ నిధులు దాదాపు పది లక్షల నుండి 65లక్షలు లోపు మంజూరైన నేపద్యంలో కేజీబీవీ కి ఏ స్కీమ్ కింద ఎన్ని నిధులు మంజూరు అయినవి, ఎలా ఖర్చు చేశారు, ఆన్లైన్ ట్రాన్స్ ఫర్ ఆన్ లైన్ ఆఫ్ చేసుకొని చేశారా లేదా సిస్టం ప్రకారం చేయలేదా అని ప్రశ్న లేవనెత్తారు. కొన్ని జిల్లాల్లో ప్రధానోపాధ్యాయులు నిధులను దుర్వినియోగం చేసి వారి సొంత అకౌంట్లో ట్రాన్స్ ఫర్ చేసినారని, అలా ఏమైనా దుర్వినియోగమయ్యాయా అని ఆరా తీశారు. సమగ్ర విచారణ చేసి రిపోర్ట్ తీసుకునేందుకు నవీపేట్ కేజీబీవీ లో ఏసీబీ దాడి చేశారు. పిఎంసి నిధులు సివిల్ వర్క్స్ కు ఎక్కువ మంజూరైనట్టు, పిపిఏ జనరేట్ చేసి సరైన వ్యక్తులకు నిధులు ఇచ్చారా లేదా అని ఆరా తీశారు. ముఖ్యంగా పిఎంశ్రీ నిధులు నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్, వర్ని కేజీబీవీ లో మంజూరయ్యాయి. నిధులు దుర్వినియోగం జరిగిందని తేలితే చర్యలు ఉంటాయని ఏసీబీ అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.