25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కోట గల్లి బాలికల సంక్షేమ హాస్టల్ లో ఏసీబీ సోదాలు

Must read

📰 Generate e-Paper Clip

https://batukammanews.com/acb-searches-kota-galli-girls-welfare-hostel/ బతుకమ్మ, నిజామాబాద్ ;

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోట గల్లి బాలికల (ఎస్సీ)సంక్షేమ హాస్టల్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే సంక్షేమ ఫలాలు వసతి గృహ విద్యార్థినిలకు అందుతున్నాయా లేవా అని కోణంలో  నిజామాబాద్ రేంజ్ ఎసిబి డిఎస్పీ శేఖర్ అధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఎసిబి, విద్యుత్ శాఖ, తునికల కోలతల శాఖ, పే అండ్ అకౌంట్స్, పుడ్ ఇన్స్ పెక్టర్, సానీటరి విభాగం అధికారులతో ఈ సోదాలు నిర్వహించారు.హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నోట్ పుస్తకాల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, పరిసరాల పరిశుభ్రత, వార్డెన్లు అందుబాటులో ఉంటున్నారా లేదా అని పరిశీలించారు. మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు హాస్టల్లో తనిఖీలకు వెళ్లడం కలకలం రేపింది. గతవారం మున్సిపల్ ఇన్చార్జి రెవెన్యూ ఆఫీసర్ ఇంటిలో ఆదాయం కు మించి ఆస్తుల కేసులో తనిఖీలు చేసిన ఏసీబీ ఈసారి హాస్టల్ లో సోదాలు చేయడం వసతి గృహ అధికారుల గుండెల్లో రైళ్ళను పరిగెత్తించింది.  హస్టల్ లలో విద్యార్థులకు సంక్షేమ ఫలాలు అందించకుండానే దోంగ బిల్లులు పెట్టి నిధులను కాజేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఎసిబి  స్టేట్ మొత్తం తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం.నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏసీబీ తనిఖీలు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులను అలజడిACB searches Kota Galli girls welfare hostel రేపింది. ఈ సంధర్బంగా విద్యార్థినీల నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. అక్కడ ఉన్న స్టాక్ తో పాటు రికార్డులను పరిశీలించారు. ఐదు శాఖల అధ్వర్యంలో తెల్లవారు జామునుంచి జరిగిన తనిఖీల పై సంక్షేమ శాఖలో చర్చ మొదలైంది.

More articles

Latest article