23.4 C
Hyderabad

ఘనంగా అబ్దుల్‌ కలాం జయంతి

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత ఏపీజే అబ్దుల్‌కలాం జయంతి వేడుకలు ఎల్లారెడ్డిపేట మండలంలో బుధవారం ఘనంగా జరిగాయి.  మొక్కల ప్రేమీకుడు సామాజిక కార్యకర్త దుంపెన  రమేష్, సీనియర్ జర్నలిస్ట్ బండారి బాల్ రెడ్డి,ఆద్వర్యంలో కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు  మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్‌కలాం భారత అణురంగంలో అత్యున్నతస్థాయికి చేరి అనేక సేవలు అందించిన గొప్ప శాస్త్రవేత్త అని అన్నారు. అలాగే ఆయన  రాష్ట్రపతిగా దేశానికి సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో  దేవరాజ్, బాలాగౌడ్ ,ఆది మల్లేష్ యాదవ్,  చంద్రారెడ్డి పర్షరాములు గౌడ్,  జర్నలిస్ట్ పెంటం శ్రీనివాస్ ,మేగి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article