జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గీ గ్రామ దారిలో మంచినీళ్ల బావిలో పడి ఓ యువకుడు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బిజ్జావార్ చంద్రమోహన్ (30) అనే యువకుడు మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. ఆదివారం మంచినీళ్ల బావిలో చంద్రమోహన్ మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. ఈమేరకు ఫిర్యాదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ రావు తెలిపారు. మృతుడికి భార్య భాగ్యలక్ష్మి, రెండు సంవత్సరాల కుమారుడు, తల్లి అనిశవ్వ ఉన్నారు.
