24.1 C
Hyderabad
Monday, August 3, 2026

రోడ్డు ప్రమాదంలో మహిళ ఎస్సై స్పాట్ డెడ్

Must read

📰 Generate e-Paper Clip

 

జగిత్యాల, బతుకమ్మ:

కారు చెట్టును ఢీకొన్న సంఘటనలో మహిళా ఎస్సై దుర్మరణం చెందారు. ఈ సంఘటన మంగళవారం జగిత్యాల జిల్లా  గొల్లపల్లి మండలం చిల్వ కోడూర్ వద్ద జరిగింది. జగిత్యాల జిల్లా క్రైమ్ రికార్డు బ్యూరో ( డి సి ఆర్ బి) లో ఎస్ ఐ గా పని చేస్తున్న శ్వేత కారులో వెళ్తుండగా మందు వస్తున్న బైక్ ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్వేత కార్ స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుని అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. శ్వేత గతంలో కోరుట్ల, పెగడపల్లి, వెల్గటూర్, కథలాపూర్ పోలీస్ స్టేషన్ లలో ఎస్ ఐ గా పనిచేశారు. మహిళ ఎస్ఐగా భవిష్యత్తు ఉన్న శ్వేత రోడ్డు ప్రమాదంలో మరణించగా కేసు నమోదు చేసి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం జగిత్యాల జిల్లా ఆసుపత్రికి తరలించారు.

More articles

Latest article