బతుకమ్మ,మోర్తాడ్: తాను పుట్టిన ఊరిలో చదువుతున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి తన సొంత డబ్బులతో నాలుగు అదనపు గదులను నిర్మిస్తున్నారు. మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు తన సొంత ఖర్చులతో నాలుగు అదనపు గదులు నిర్మాణం చేపడుతున్న ధర్మోరా వాస్తవ్యులు ఎన్నారై ముసుకు అనుప్ కుమార్ రెడ్డి పాఠశాలకు వచ్చి అదనపు గదుల నిర్మాణాన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రఘునందన చారి, ఉపాధ్యాయులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
