25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉపాధ్యాయ నారీమణులకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బాలుర ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయ నారీమణులకు, అంగన్వాడి టీచర్లకు బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి యాదగిరి శాలువాలతో సత్కరించారు. ఉపాధ్యాయ వృత్తికి వన్నెతెచ్చిన వీరనారి సావిత్రిబాయి పూలే అన్నారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహించి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన ఘనత ఆమెకి చెందిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ఉన్నారు.

More articles

Latest article