24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రక్షిత మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

  •  సీపీఎం పార్టీ ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ 

రుద్రూర్,  బతుకమ్మ  : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రక్షిత ఆత్మహత్యపై ప్రభుత్వం, పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని రక్షిత ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. విద్య వ్యవస్థ మీద విద్యాశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక కారణమన్నారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మృతికి కారణమైన బాధ్యులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రక్షిత కుటుంబానికి ప్రభుత్వం యాభై లక్షలు ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి భరోసా ఇవ్వాలన్నారు.

More articles

Latest article