రక్షిత మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి
సీపీఎం పార్టీ ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ రుద్రూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రక్షిత ఆత్మహత్యపై ప్రభుత్వం, పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని రక్షిత ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. విద్య వ్యవస్థ మీద విద్యాశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం కూడా ఒక కారణమన్నారు. ఇటువంటి...