24 C
Hyderabad
Sunday, August 2, 2026

హిందూ పుణ్యక్షేత్రాల యాత్ర పథకం తీసుకురావాలి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: హజ్ యాత్ర తరహాలో ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 500 మంది భక్తులు చార్ ధామ్ (కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి)కు వెళ్లేందుకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని అర్బన్ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు.

అసెంబ్లీ సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఇటీవల దాడులలో విగ్రహాలు ధ్వంసం అయిన ప్రతిగుడి పునః ప్రతిష్టాపనకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించేలా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ప్రత్యేకంగా తెలంగాణ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ఆలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పారదర్శకంగా స్థానిక అభివృద్ధికి వినియోగించాలని అన్నారు.

తెలంగాణ రాక ముందు 87,235 ఎకరాల దేవాదాయ భూములు ఉండేవని, తెలంగాణ వచ్చిన తరువాత 20,124 ఎకరాల భూములు కబ్జాకు గురైతే కేవలం 1146 ఎకరాలకు మాత్రమే కేసులు నమోదయ్యాయని అన్నారు. కబ్జాకు గురైన మిగతా భూముల లెక్క ప్రభుత్వం దగ్గర ఉందా? ఉంటే ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు.
టూరిజం పాలసీలో ఖిల్లా రామాలయాన్ని చేర్చాలి
టూరిజం 2025 – 30 పాలసీలో రాష్ర్టంలోని ముఖ్యంగా 27 పర్యాటక ప్రాంతాలను గుర్తించారని, 775 కోట్ల బడ్జెట్ తో అభివృద్ధి సాధ్యమా అని ప్రశ్నించారు. కేవలం ప్రాంతాల పేర్లు, స్థలాలు చెప్పారని, కానీ పాలసీ లో వాటిని ఏ రకంగా అభివృద్ధి చేస్తారో సరైన సమాధానం లేదన్నారు.

ప్రభుత్వం పాలసీ లో పేర్కొన్న 27 ప్రాంతాలతో పాటు నిజామాబాద్ అర్బన్ లో ఉన్న ఖిల్లా రామాలయాన్ని కూడా అందులో చేర్చి అభివృద్ధి చేయాలని కోరారు.

More articles

Latest article