హిందూ పుణ్యక్షేత్రాల యాత్ర పథకం తీసుకురావాలి

హైదరాబాద్, బతుకమ్మ: హజ్ యాత్ర తరహాలో ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 500 మంది భక్తులు చార్ ధామ్ (కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి)కు వెళ్లేందుకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని అర్బన్ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఇటీవల దాడులలో విగ్రహాలు ధ్వంసం అయిన ప్రతిగుడి పునః ప్రతిష్టాపనకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించేలా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ప్రత్యేకంగా తెలంగాణ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ఆలయాల ద్వారా వచ్చే...