నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పని చేయనిదే పూట గడవని స్థితిలో ఉన్న ఆ తల్లి చంటి బిడ్డను పక్కనే పడుకోబెట్టి చాయ్ స్టాల్ నడుపుతున్న ఈ దృశ్యం నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డులో ‘బతుకమ్మ’ కెమెరాకు చిక్కింది. ఓ వైపు తన బిడ్డను లాలిస్తూ మరో వైపు చాయ్ చేసి కస్టమర్లకు అందిస్తోంది. తాను పని చేస్తేనే రోజటిరోజు భోజనమని, అందుకే చంటి బిడ్డను తన పక్కనే ఉంచి లాలిస్తూ పని చేస్తున్నానని ఆ తల్లి అంటోంది.
