24 C
Hyderabad
Sunday, August 2, 2026

వ్యభిచార ముఠా గుట్టురట్టు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టైంది. నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమిషనర్ సింధూ శర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య, సీసీఎస్ సిబ్బంది సోమవారం మారుతి నగర్ లోని ఒక ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార నిర్వాహకురాలితో పాటు ముగ్గురు మహిళలను, ఒక విటుడిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.3,660 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం నిజామాబాద్ రూరల్ ఎస్ హెచ్ ఓకు అప్పగించారు.

More articles

Latest article