27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రముఖ వైద్యులు బాపురెడ్డి కన్నుమూత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ:

ప్రముఖ వైద్యుడు డాక్టర్ జాల బాపురెడ్డి(75) ఆనారోగ్యంతో కన్నుముశారు. గత కొంతకాలంగా లివర్ సెల్ క్యాన్సర్ తో బాధపడుతున్న డా.బాపురెడ్డి శనివారం రాత్రి హైదరాబాద్ లో చనిపోయారు. ఫిజిషియన్ గా నాలుగు దశాబ్ధాలు పైగా వైద్య సేవలందిస్తున్న బాపురెడ్డి నిజామాబాద్ జిల్లాలో సుపరిచితుడు. పూర్వపు కరీంనగర్ జిల్లా ఇల్లంతుకుంట మండలం అనంతగిరికి చెందిన డా.బాపురెడ్డి నిజామాబాద్ కేంద్రంగా ఎం.డి.ఫిజిషియన్ వైద్యుల్లో ప్రముఖులు. డా.బాపురెడ్డికి భార్య,  ఇద్దరు కుమారులున్నారు. టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో బాపురెడ్డి ఒకరు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాలో బాపురెడ్డి అత్యంత ఆప్తుడు. టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లారు. బీజేపీ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీజేపీ  రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానిమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు సమన్వయకర్తగా పని చేశారు. ఐఎంఏలోనూ సీనియర్ గా పలు పదవులు అలంకరించారు. డా.బాపురెడ్డి మృతి పట్ల వైద్యులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

 

More articles

Latest article