27.5 C
Hyderabad
Friday, July 31, 2026

27న బోధన్ శ్రీరామ మందిరంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

బోధన్ , బతుకమ్మ : ఈ నెల 27న బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ లోని సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి శతగళ ఆరాధన ఉత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా కార్యక్రమ నిర్వాహకులు ప్రతాప శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ తల్లిదండ్రులైన స్వర్గీయ ప్రతాప అన్నపూర్ణ, స్వర్గీయ రామకృష్ణయ్య జ్ఞాపకార్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. దాదాపుగా 100 పైచిలుకు సంగీత కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత ఆచార్యులు డాక్టర్ మండా సర్వేశ్వరరావు,క్టర్ టి స్వప్న రాణి, శ్రీ రాకేష్ వైద్య,అతిథులుగా శేష తల్ప సాయి కందకుర్తి యాదవ రావు, డాక్టర్ కాసర్ల నరేష్ రావు పాల్గొంటున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంగీత సాహిత్య అభిమానులు అందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకుల పక్షాన ప్రతాప గౌరీ శంకర శాస్త్రి, ప్రతాప సత్య సాయిబాబా తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో సంగీతాచార్యులు డా.టి స్వప్న రాణి, డాక్టర్ కాసర్ల నరేష్ రావు, చంద్రాచార్య భాస్కర్ రాజు పాల్గొన్నారు.

More articles

Latest article