27న బోధన్ శ్రీరామ మందిరంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం
బోధన్ , బతుకమ్మ : ఈ నెల 27న బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ లోని సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి శతగళ ఆరాధన ఉత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా కార్యక్రమ నిర్వాహకులు ప్రతాప శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ తల్లిదండ్రులైన స్వర్గీయ ప్రతాప అన్నపూర్ణ, స్వర్గీయ రామకృష్ణయ్య జ్ఞాపకార్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. దాదాపుగా 100 పైచిలుకు సంగీత కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత ఆచార్యులు...