24.2 C
Hyderabad

5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2026 షూరు

5th Telangana State Police Sports and Games 2026 begins

Must read

📰 Generate e-Paper Clip

 

. . . క్రీడలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ వేదికగా జరుగుతున్న క్రీడలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రారంభించారు. గురువారం జిల్లాలోని వివిధ క్రీడా వేదిక ల వద్ద ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ , సైక్లింగ్ , అథ్లెటిక్స్ , ఆర్చరీ , వాటర్ స్పోర్ట్స్ తదితర క్రీడా పోటీలు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి  వచ్చిన పోలీస్ క్రీడాకారులు ఈ క్రీడా పోటీల లో పాల్గొంటున్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకుంటూ , క్రీడాస్ఫూర్తి , పట్టుదల , క్రమశిక్షణతో పోటీల లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు అని సిపి తెలిపారు.

5th Telangana State Police Sports and Games 2026 begins

ఉదయం క్రిడాకారుల పరిచయ కార్యక్రమం అనంతరం గేమ్స్ ప్రారంభమయ్యాయి. పోలీస్ శాఖలో విధి నిర్వహణతో పాటు శారీరక దృఢత్వం , మానసిక ఉల్లాసం , క్రమశిక్షణ ,పరస్పర స్నేహ భావాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని  సి పీ సాయి చైతన్య పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రతిష్టాత్మక క్రీడా వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ అధికారులు , సిబ్బంది సమన్వయంతో కృషి చేస్తున్నారు.

5th Telangana State Police Sports and Games 2026 begins

More articles

Latest article