. . . క్రీడలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ వేదికగా జరుగుతున్న క్రీడలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రారంభించారు. గురువారం జిల్లాలోని వివిధ క్రీడా వేదిక ల వద్ద ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ , సైక్లింగ్ , అథ్లెటిక్స్ , ఆర్చరీ , వాటర్ స్పోర్ట్స్ తదితర క్రీడా పోటీలు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ క్రీడాకారులు ఈ క్రీడా పోటీల లో పాల్గొంటున్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకుంటూ , క్రీడాస్ఫూర్తి , పట్టుదల , క్రమశిక్షణతో పోటీల లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు అని సిపి తెలిపారు.

ఉదయం క్రిడాకారుల పరిచయ కార్యక్రమం అనంతరం గేమ్స్ ప్రారంభమయ్యాయి. పోలీస్ శాఖలో విధి నిర్వహణతో పాటు శారీరక దృఢత్వం , మానసిక ఉల్లాసం , క్రమశిక్షణ ,పరస్పర స్నేహ భావాన్ని పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని సి పీ సాయి చైతన్య పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ప్రతిష్టాత్మక క్రీడా వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు పోలీస్ అధికారులు , సిబ్బంది సమన్వయంతో కృషి చేస్తున్నారు.
