. . . కాళ్ళు మొక్కించుకున్న గడీల వాళ్ళను తరిమి కొట్టిన సంస్కృతి మాది
. . . మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పై మంత్రి సీతక్క ఫైర్
భీంగల్, బతుకమ్మ :
మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి మంత్రి సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం జిల్లా పర్యటన లో భాగంగా భీంగల్ లక్ష్మినర్సింహాస్వామి ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్బంగా సీతక్క పర్యటన పై బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేసిన వాఖ్యలపై కంటతడి పెట్టుకున్నారు. నేను ఏం తప్పు చేశానని గిరిజన మహిళను నాకు సిగ్గు లేదు అని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఒక మహిళను పట్టుకొని అవమానించాడు. జిల్లాకు ఇంచార్జీ గా వచ్చినందుకు ఇదేనా నా పై మాట్లాడటం అన్నారు. నేను మాట్లాడితే నువ్వు తల ఎక్కడ పెట్టుకోలేవు ప్రశాంత్ రెడ్ది అన్నారు. నేను అనుకుంటే బయట తిరగలేవు, ఉరికించి కొడుత అంటూ సీతక్క వార్నింగ్ ఇచ్చారు.10 ఏళ్లు ఏలిన నువ్వు మంత్రిగా ఏం చేశావు చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఇదేనా నిజామాబాద్ ప్రజలు ప్రశాంత్ రెడ్డి కి నేర్పిన బుద్ధి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము కాళ్ళు మొక్కించుకొము. కాళ్ళు మొక్కించుకున్న గడిల వాళ్ళను తరిమి కొట్టే సంస్కృతి మాది అని సీతక్క ఫైర్ అయ్యారు. గిరిజన మహిళ మంత్రి అయినప్పటి నుంచి బీఆర్ ఎస్ టార్గెట్ నన్ను చేస్తుందన్నారు. కూతురు దుమ్మెత్తి పోస్తున్నట్లు మహిళల జోలికి వస్తే కేసీఆర్ పై అదే జరుగుతుందన్నారు. బాల్కొండ మహిళలు ప్రశాంత్ రెడ్డి బుద్దు మార్చుకోవాలని నిలదీయాలని పిలుపునిచ్చారు.
