19.2 C
Hyderabad

చిక్లీలో కొత్త పింఛన్ల పంపిణీ

Distribution of new pensions in Chikli

Must read

📰 Generate e-Paper Clip

 

 మాక్లూర్, బతుకమ్మ:

మాక్లూర్ మండలం చిక్లీ గ్రామ పంచాయతీ లో ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన  చేయూత పింఛన్లు లను సర్పంచ్ భూమన్న, ఉప సర్పంచ్ సతీష్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పంపిణీ చేశారు. గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన పింఛన్లు లను లబ్ధిదారులకు పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ లు మాట్లాడుతూ… కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన చేయూత పెన్షన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ రెడ్డి సహాయ సహకారాలతో వితంతువులకు, వికలాంగులకు, గీత కార్మికులకు మంజూరు చేసిన నూతనంగా  చేయూత పెన్షన్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు  పాల్గొన్నారు.

More articles

Latest article