21.7 C
Hyderabad

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యునిగా డా.జైపాల్ రెడ్డి ఎన్నిక

Dr. Jaipal Reddy elected as a member of the Indian Red Cross Society State Finance Committee

Must read

📰 Generate e-Paper Clip

 

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఫైనాన్స్ కమిటీ సభ్యునిగా కామారెడ్డి జిల్లాకు చెందిన డా.ఎం. జైపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌ ( లోక్ భవన్‌) లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్, రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు శివ ప్రతాప్ శుక్లా ఆధ్వర్యంలో రాష్ట్ర చైర్మన్ దాన కిషోర్ ఐఏఎస్ అధ్యక్షతన రాష్ట్ర మేనేజింగ్ కమిటీ  సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల చైర్మన్లు, స్టేట్ ఎంసి సభ్యులు పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం వారి సమక్షంలో  ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగినది. తదుపరి ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర   ఫైనాన్స్ కమిటీ,  కార్యవర్గ  సభ్యులను ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా స్టేట్ ఎంసి సభ్యులు ఆర్కే  గ్రూప్ సీఈఓ అయిన డా. ఎం. జైపాల్ రెడ్డికి రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ సభ్యునిగా స్థానం దక్కింది. ఈ సందర్భంగా డా. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతానని తెలిపారు. రాబోయే రోజుల్లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు రెడ్ క్రాస్ ద్వారా మెరుగైన సేవా కార్యక్రమాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా ‘నషా ముక్త భారత్’ (మత్తు పదార్థాల నిర్మూలన) ఇతర ఆరోగ్య సంబంధిత అవగాహన కార్యక్రమాల్లో సమర్థవంతమైన బృందంతో కలిసి ముందుంటామని పేర్కొన్నారు. తనను ఎన్నిక చేసినందుకు గాను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకి, రాష్ట్ర చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన దాన కిషోర్ కి, రాష్ట్ర సెక్రటరీ  సీఈఓ శ్రీరాములుకి,  ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర స్థాయి కమిటీలో స్థానం సంపాదించిన డా. ఎం. జైపాల్ రెడ్డికి కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ సంజీవ్ రెడ్డి, కామారెడ్డి ఐఆర్సిఎస్ సభ్యులు డా.బాలు,  దత్తాత్రి, ఇతర సభ్యులు, ఆర్కే గ్రూప్ అధ్యాపక బృందం, సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

More articles

Latest article