26.3 C
Hyderabad

ఆశవర్కర్లకు 18 వేల వేతనం చెల్లించాలి

ASHA workers should be paid a salary of 18,000.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆశా వర్కర్లకు 18 వేల రూపాయల వేతనం చెల్లించాలని లేనియెడల డిసెంబర్ 15 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారులు బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డికి, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి ఆశా వర్కర్లు బడుగు బలహీన వర్గాలకు సేవలందిస్తున్నారని, గర్భిణీ బాలింతలకు అండగా నిలబడుతున్నారని, ప్రజలకు సీజనల్ వ్యాధులు అంటు వ్యాధులు శోకకుండా అరికడుతున్నారని అన్నారు. ఉదయం 9 నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు సబ్ సెంటర్లలో విధులు నిర్వహిస్తున్నారని, అనేక సర్వేలలో ప్రభుత్వానికి సహకరిస్తున్నారని అటువంటి ఆశ వర్కర్లకు పెరుగుతున్న ధరలు కనుగుణంగా వేతనాలు పెంచుతామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు జరపటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల సమస్యల పరిష్కారం కొరకు ఆశా వర్కర్లు డిసెంబర్ 15 నుండి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించడం జరిగిందని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తాను ఇచ్చిన హామీలను అమలు జరపాలని వారు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు 50 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించి, చనిపోయిన ఆశ వర్కర్లకు మట్టి ఖర్చులకు 50,000 ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్  ఐదు లక్షలు చెల్లించాలని, వేతనంలో సగం పెన్షన్ను ఇవ్వాలని ,సంవత్సరానికి 20 రోజులు క్యాజువల్ లీవులను, ఆరు నెలల ప్రసూతి సెలవులను అమలు జరపాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆశాలకు జరపాలని వారు అన్నారు.  ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు సుకన్య,  స్వప్న, రేణుక ,అనిత, సిఐటియు నాయకులు జంగా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

ASHA workers should be paid a salary of 18,000.
 

More articles

Latest article