21.8 C
Hyderabad

ఆటో పై కూలిన భారీ వృక్షం

Large tree falls onto an auto-rickshaw

Must read

📰 Generate e-Paper Clip

 

. . .ఐదుగురికి గాయాలు

రుద్రూర్, బతుకమ్మ :

ప్రయాణికులతో వెలుతున్న ఆటో పై మార్గమధ్యంలో చెట్టు కూలింది. ఈ ఘటనలో ప్రయాణికులు గాయపడ్డారు. మంగళవారం ఉదయం రుద్రూర్ –  బోధన్ రహదారి పై బోధన్ వైపు వెళుతున్న టిఎస్ 16యుఏ0344 నంబర్ గల ఆటోపై భారీ వృక్షం కూలడంతో ఐదుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆటోలో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు బయటకు తీసి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆటోలో ప్రయాణిస్తున్న వారు వర్ని మండలం పెద్దగుట్ట గ్రామానికి చెందినవారుగా స్థానికులు చెప్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Large tree falls onto an auto-rickshaw

More articles

Latest article