30.2 C
Hyderabad

జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి జైలు శిక్ష

District Collector Narayana Reddy sentenced to prison

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించిన హైకోర్టు

 

రంగారెడ్డి, బతుకమ్మ :

 

కోర్టు ఉత్తర్వుల ధిక్కరణకు పాల్పడిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఆరు నెలల సాధారణ కారాగార శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ రాష్ట్ర  హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పులో ఉన్న సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22 ఏ ప్రకారం నిషేదిత ఆస్తుల జాబితాలో నుంచి కొన్ని ప్లాట్లను తొలగించాలంటూ బాధితులు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు 2025 ఆగస్టులో జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. 60 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వాటిని అమలు చేయలేదు. దానితో బాధితులు 2025 అక్టోబర్  15న కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ నమోదు అయిన తర్వాత కదిలిన జిల్లా అధికార యంత్రాంగం బాధితులకు నోటీసులు జారీ చేసి 2026 ఫిబ్రవరి 26న వారి వినతిని తిరస్కరించారు. కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలు అయిన తర్వాత కూడా జిల్లా కలెక్టర్ వ్యవహరించిన తీరుపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశించినప్పటికీ స్పందించకుండా, కోర్టు దిక్కరణ పిటిషన్ దాఖలయ్యాక నామమాత్రంగానే ఉత్తర్వులు ఇవ్వడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఉద్దేశపూర్వకంగానే కోర్టు దిక్కరణకు పాల్పడ్డారని నిర్ధారించి ఐఏఎస్ స్థాయి అధికారి కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేయడంపై ధర్మాసనం కఠిన  నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అయితే అప్పిల్ కు వీలుగా శిక్ష అమలులో నాలుగు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

District Collector Narayana Reddy sentenced to prison
 

More articles

Latest article