29.9 C
Hyderabad

త్వరలో నిజామాబాద్‌లో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన

National President Nitin Nabin to visit Nizamabad soon

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎంపీ అర్వింద్ ధర్మపురి విజ్ఞప్తికి సానుకూల స్పందన

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేపడుతున్న వివిధ యాత్రలు, కార్యక్రమాల్లో భాగంగా  నిజామాబాద్‌లో కూడా పర్యటించి, యాత్ర నిర్వహించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్‌ను కోరారు.ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పార్టీకి ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని, ఇక్కడ పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకమై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. జాతీయ స్థాయి నాయకత్వం నిజామాబాద్‌లో పర్యటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొనడంతో పాటు, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఎంపీ అర్వింద్ విజ్ఞప్తిపై జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని, పర్యటన తేదీలు, కార్యక్రమాలు ఖరారైన వెంటనే నిజామాబాద్‌లో కూడా యాత్ర నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తానని ఎంపీకి తెలిపారు. జాతీయ అధ్యక్షులు తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించడం పట్ల ఎంపీ అర్వింద్ ధర్మపురి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ పర్యటన ఖరారైన అనంతరం నిజామాబాద్ పర్యటనకు సంబంధించి తగిన ఏర్పాట్లు, కార్యక్రమాల రూపకల్పనపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు. దీపావళి పండుగ అనంతరం ఢిల్లీలో జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్‌ను ప్రత్యక్షంగా కలిసి, నిజామాబాద్ పర్యటనకు అధికారికంగా ఆహ్వానించనున్నట్లు ఎంపీ అర్వింద్ వెల్లడించారు.జాతీయ అధ్యక్షుల పర్యటన ద్వారా నిజామాబాద్ ప్రాంతంలో పార్టీ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత లభిస్తుందని, కార్యకర్తలకు జాతీయ నాయకత్వంతో నేరుగా మమేకమయ్యే అవకాశం కలుగుతుందని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.

More articles

Latest article