27.6 C
Hyderabad

గిరిరాజ్ కళాశాల ప్రాంగణాన్ని కమర్షియల్ వ్యాపారానికి వినియోగించడం తగదు

It is inappropriate to use the Giriraj College premises for commercial business purposes

Must read

📰 Generate e-Paper Clip

 

. . . క్రికెట్ అకాడమీ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

. . . కాలేజీ ప్రిన్సిపాల్ కు విద్యార్థి సంఘాల ఫిర్యాదు

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల ఆవరణలో కమర్షియల్ పద్ధతిలో క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్న వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎఐఎస్ఎఫ్, ఎఐపిఎస్ యూ లఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్ సదుపాయం కళాశాల విద్యార్థుల క్రీడా అభివృద్ధికి ఉపయోగపడాల్సి ఉండగా, కొందరు వ్యక్తులు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అసోసియేషన్ పేరును వాడుకొని ప్రైవేట్ అకాడమీ గా విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేస్తూ కమర్షియల్‌గా నిర్వహించడం ఆందోళనకరమని అన్నారు.

ప్రభుత్వ భూమి, ప్రభుత్వ వనరులను వ్యక్తిగత ఆదాయ వనరుగా మార్చడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గిరిరాజ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా  క్రికెట్ శిక్షణ పొందే అవకాశం కల్పించాలని కోరారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా క్రీడలకు దూరం కాకుండా ప్రభుత్వం అందించిన సదుపాయాలు అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

విద్యార్థి సంఘాల వినతి పై స్పందించిన గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న అట్లయితే పూర్తి స్థాయి విచారణ జరిపి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం,ఎఐపిఎస్ యూ జిల్లా కార్యదర్శి బోడ అనిల్, ఎఐఎస్ఎఫ్ గిరిరాజ్ కళాశాల అధ్యక్షుడు నగేష్, కార్యదర్శి కిషోర్,అనూష సన్ని, రాజేష్, భాను,సొన్ రాజ్,రాంచరణ్, నిరాజ్,ఐపిఎస్ యూ నాయకులు రంజిత్, సిద్ధార్థ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article