. . . బిఆర్ఎస్ లీడర్ ల కమీషన్ ల కారణంగా ప్యాకేజీ 21 ద్వార ఎకరం కు సాగునీరు అంద లేదు
. . . జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి
నిజామాబాద్ , బతుకమ్మ:
ఎంపీ ధర్మపురి అరవింద్ 8 సంవత్సరాల లో జిల్లాకు ఏం అభివృద్ధి చేసి, ఎన్ని నిధులు తెచ్చారు.. బిజేపి పార్టీ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తీసుకు వచ్చాడని నువ్వు ఎందుకు నిజామాబాద్ కు స్మార్ట్ సిటీ తీసుకురాలేదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, మేయర్ ఉమారాణి లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి మాట్లాడుతూ … జిల్లా ముఖ్య కాంగ్రెస్ నాయకులు అక్టోబర్ 24వ తేదీన ముఖ్యమంత్రి ని కలిసి ఆర్ ఓ బి పై చర్చించి జీవో విడుదల చేస్తున్నామని గ్రహించిన అరవింద్ అకస్మాత్తుగా ధర్నా చేపట్టారు ఆరోపించారు. ఆ ధర్నా లో ప్రజలు ఎవరూ కూడా రా లేదని, కేవలం అరవింద్ ఉనికి కోసం ధర్నా చేశారు, స్కూల్ యాజమాన్యాన్ని బెదిరించి విద్యార్థుల ను తీసుకువచ్చి ధర్నా లు చేశారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు తీసుకువచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న అరవింద్ దీనివల్ల రైతులకు జరిగిన లాభమేమి లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని చేస్తున్న కూడా కేవలం తమ స్వార్థం కొరకు ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని అరవింద్ దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. 8 సంవత్సరాల జిల్లాకు నువ్వు చేసిన అభివృద్ధి రెండు సంవత్సరాల 11 నెలల కాలంలో మేము చేసిన అభివృద్ధి పై చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పై అబద్ధపు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు అని నగేష్ రెడ్డి హెచ్చరించారు.
బిఆర్ఎస్ నాయకులు నీళ్లు వదిలాలని కాళేశ్వరం వెళ్లడం జరిగిందని 10 సంవత్సరాల పాలనలో లక్షల కోట్ల అప్పు చేశారని ప్రశాంత్ రెడ్డి జిల్లాకు తీసుకువచ్చింది ఏమీ లేదు అని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ విమర్శించారు. సుదర్శన్ రెడ్డి మంత్రి గా గుత్ప, అల్లి సాగర్ ఎత్తిపోతల పథకాల ఎత్తును పెంచి నిజామాబాద్ పట్టణానికి తాగునీరు అందించడం జరిగిందని, వ్యవసాయానికి నీళ్లు అందిస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ నగరానికి ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్ కాలేజీ తీసుకురావడం జరిగింది ,షబ్బీర్ అలీ డిచ్పల్లి లో 400 కె.వి సబ్ స్టేషన్ నిర్మాణం చేశారని గుర్తు చేశారు. సుదర్శన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ప్యాకేజీ 20, 21 కోసం 800 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది, దానికి మీరు 300 కోట్లు ఖర్చు పెడితే జిల్లాలో సుమారు 85 వేల ఎకరాలకు సాగు నీరు అందేదని తెలిపారు. కాని ప్యాకేజీ 20,21ల ను నిర్వీర్యం చేశారని కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం 3600 కోట్ల డిజైన్ తీసుకువస్తే దానికి 5000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది గుర్తు చేశారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 6000 కోట్లు ఖర్చు చేశారు 11 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఎందుకు దాని దాని డిజైన్ మార్చి లక్ష పదివేల కోట్లకు తీసుకుపోవడం జరిగిందని కేవలం మీ కమిషన్ల కోసమే డిజైన్ మార్చి అవినీతి చేశారని రైతులకు ఎక్కడ ఓక్క ఎకరంకు నీరు అందించిన పాపాన మీరు పోలేదని, మీ స్వార్థాలను కప్పిపుచ్చుకోవడానికి ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల 11 నెలలు అవుతుంది అని, ఒక పక్క బిఆర్ఎస్ బిజెపి నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ల కారణంగా జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం జరిగింది, తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడం జరిగిందని అన్నారు.నిజామాబాద్ అర్బన్ లో డివిజన్ కు కోటి రూపాయల చొప్పున 60 కోట్లు, జిల్లాలో సుమారు 400 కోట్లు అభివృద్ధి నిధులు తీసుకురావడం జరిగిందని, భీంగల్ నుండి బాసర వరకు హైవే తీసుకురావడం జరిగిందని ,భీమ్గల్ లింబాద్రి గుట్ట అభివృద్ధి కొరకు నాలుగు కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో డిసిసి కోశాధికారి భక్తవత్సలం, ఉపాధ్యక్షులు కౌడపు శరత్ కుమార్,మహిళ నగర అధ్యక్షులు రేవతి,మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్,జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు బెన్సన్ రాజు, సీనియర్ నాయకులు మీసాల సుధాకర్,డిసిసి ప్రధాన కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు
