22.4 C
Hyderabad

బాన్సువాడలో తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు

Preemptive arrests of Telangana activists in Banswada

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి

 

. . . టియూఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉడుత గంగాధర్ గుప్త

 

బాన్సువాడ,  బతుకమ్మ :

 

తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి నివాసానికి ముట్టడికి బయలుదేరిన బాన్సువాడ పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులను సోమవారం తెల్లవారుజామున పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టియూఎఫ్) ఆధ్వర్యంలో అక్టోబర్ 26న సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు బయలుదేరిన ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా టియూఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉడుత గంగాధర్ గుప్త మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నప్పటికీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఐదు నెలల క్రితం ఏర్పాటు చేసిన కేకే కమిటీ కాలయాపనకే పరిమితమైందని ఆరోపించారు. హామీల అమలు కోసం ఉద్యమకారులు ఆందోళనలకు సిద్ధమవుతుంటే రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు అరెస్టులు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల మేరకు ఈ నెలాఖరులోగా ఆన్‌లైన్ ప్రక్రియను ప్రారంభించాలని గంగాధర్ గుప్త ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నవంబర్ నెలలో కచ్చితంగా ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎదురైన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఎదురవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.అరెస్టయిన వారిలో టియూఎఫ్ బాన్సువాడ మండల అధ్యక్షుడు కాల్వ శ్యామ్, ప్రధాన కార్యదర్శి దమ్మణపేట భాస్కర్ గౌడ్, ఎద్దుబల్లె కృష్ణ, అగ్లవే దత్తు, గైని గంగారామ్, పల్లికొండ సాయిలు, బుర్రిగారి మహేష్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article