27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కేసీఆర్ తోనే గిరిజన అభివృద్ధి

Must read

📰 Generate e-Paper Clip

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

భీంగల్, బతుకమ్మ : బీయర్ఎస్ ప్రభుత్వ పాలనలో కెసీయర్ తోనే గిరిజనుల అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం భీమ్ గల్ మండలం కేంద్రం బంజార భవనం కు ప్రహరీ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసి, మండలంలోని సంతోష్ నగర్ తాండ, సుదర్శన్ నగర్ తాండల్లో నిర్మాణం పూర్తి అయిన గ్రామ పంచాయతీ భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న గ్రామాలతో పాటు గిరిజన తాండలను అభివృద్ధి చేసేందుకు గాను గ్రామ పంచాయతీ లుగా మార్చి, వాటికి సొంత భవనాలను మంజూరు చేశారన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీల్లో అతి చిన్న గ్రామ పంచాయతీలు ఇవే కావచ్చునేమోనని అయన అన్నారు.అంతే కాకుండా కానిస్టెన్సీ ఒక్క బంజార భవనాన్ని గిరిజనులు అడగడం తడవుగా బాల్కొండ కానిస్టెన్సీ లో భీమ్ గల్ పట్టణం లో రూ. 50లక్షలతో బంజారా భవన్ ను నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగిందని అన్నారు. బంజారా భవన్ కు ప్రహరీ కావాలని అడగగా సీడీపీ నిధుల నుండి రూ. 17 లక్షల మంజూరు చేసి ఈ రోజు ఆపనులకు శంకుస్థాపన చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమం లో బంజార నాయకులు, బీయర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article