25.8 C
Hyderabad

తెలంగాణ ప్రోహిబిషన్  ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

Bathukamma celebrations held under the aegis of the Telangana Prohibition & Excise Head Constables and Constables Association

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న అసిస్టెంట్ కమిషనర్ ఎన్ ఫోర్స్ మెంట్ రాజలక్ష్మి

 

ఇందూర్, బతుకమ్మ :

 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమైన బతుకమ్మ పండుగ వేడుకలను తెలంగాణ ప్రోహిబిషన్, ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  నిజమాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల ఎన్  ఫోర్స్ మెంట్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో ఎక్సైజ్ మహిళ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, మహిళలు, యువతులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్, అసిస్టెంట్ కమిషనర్ రాజ్యలక్ష్మిలు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ప్రతిభంభించేలా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి  సాంప్రదాయ పాటలతో సందడి చేశారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొనడంతో పండుగ వాతావరణం సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పటేలా ప్రతి ఏడాది  ప్రోహిబిషన్ , ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ అసిత్వానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ఆనందదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ అరుణ్ కుమార్, డిపిఓ నంద గోపాల్, తిరుపతి, శ్రీనివాస్ లు, జోన్ కమిటీ సభ్యులు కైలాస్ పవర్, లింబాద్రి, చల్ల బాబు, విజయ్ నంద్,  సిడి టు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సునీల్ కంబ్లి, రవి, మహిళ కానిస్టేబుళ్లు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Bathukamma celebrations held under the aegis of the Telangana Prohibition & Excise Head Constables and Constables Association

More articles

Latest article