25.7 C
Hyderabad

2027 జనాభా లెక్కల్లో న్యాయమైన కుల గణన చేపట్టాలి

A fair caste census must be conducted as part of the 2027 population census

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బిఎల్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 2027 జనాభా లెక్కల్లో న్యాయమైన కుల గణన చేపట్టాలని ప్రస్తుత సెన్సస్ ప్రక్రియను నిలిపివేసి, రాష్ట్రాల వారీ ఓబీసీ డ్రాప్-డౌన్ జాబితాల ఆధారంగా కుల కోడింగ్‌తో తిరిగి ప్రారంభించాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ ఎఫ్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్లు కాంబ్లే మధు,కర్రోల్ల శ్రీనివాస్ లు రాష్ట్రపతి కి రాసిన లేఖను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కి అందజేశారు.  అనంతరం వారు మాట్లాడుతూ వెనుకబడిన తరగతులు ,షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారు  రాజ్యాంగబద్ధమైన హక్కులు, సంక్షేమ ఫలాలను కాపాడటానికి ఖచ్చితమైన డేటా ఎంతైనా అవసరమని, నిజమైన ప్రజాస్వామ్య పరిపాలనకు ఇది అత్యంత విలక్షణమైనదన్నారు.  వెనుకబడిన తరగతుల బీసీల చేర్పు సెన్సస్ 2027 షెడ్యూల్‌లోని ‘ప్రశ్న సంఖ్య 10’లో ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు వెనుకబడిన తరగతులు (బీసీలు) అని స్పష్టంగా పేర్కొనాలని వారికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రాల వారీ కులాల డ్రాప్-డౌన్ జాబితాలు డేటాలో ఎలాంటి పొరపాట్లు, సమాచారం నమోదు కాకపోవడం, లేదా పరిపాలనాపరమైన అయోమయం లేకుండా ఉండేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు సంబంధించి రాష్ట్రాల వారీగా నిర్దిష్ట కులాల పేర్లతో కూడిన డ్రాప్-డౌన్ జాబితాలను సెన్సస్ ఫ్రేమ్‌వర్క్‌ లో చేర్చాలన్నారు. వనరుల సమాన పంపిణీని నిర్ధారించడానికి ప్రభుత్వం తన అస్పష్టమైన వైఖరిని వీడి, వివరమైన కులాల వారీ డేటాను బహిరంగంగా విడుదల చేస్తామని స్పష్టమైన కట్టుబాటును ప్రకటించాలన్నారు. భారత జనాభాలో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు అత్యంత భారీ నిష్పత్తిలో ఉన్నారని, ఖచ్చితమైన, నిష్పాక్షికమైన సంఖ్యాత్మక డేటా లేకుండా నిర్దిష్ట సంక్షేమ విధానాలు, విద్యా రిజర్వేషన్లు, నిధుల కేటాయింపులు లోపభూయిష్టంగా అసంపూర్తిగా ఉండిపోతాయన్నారు. ప్రస్తుత సెన్సస్ ప్రక్రియను వెంటనే నిలిపివేసి, రాష్ట్రాల వారీ ఓబీసీ డ్రాప్-డౌన్ జాబితాల ద్వారా కుల కోడింగ్‌ను అమలు చేస్తూ హైబ్రిడ్ మోడ్‌లో దీనిని తిరిగి ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని, సెన్సస్ 2027 పూర్తిగా పారదర్శకంగా, సమగ్రంగా, ఖచ్చితమైనదిగా ఉండటానికి ఇది అత్యంత అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఎఫ్ జిల్లా నాయకులు హైమద్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article