25.7 C
Hyderabad

సబ్‌స్టేషన్‌ను ముట్టడించిన రైతులు

Farmers lay siege to the substation

Must read

📰 Generate e-Paper Clip

 

. . .త్రి ఫేజ్ విద్యుత్ సరఫరా సక్రమంగా చేయాలని డిమాండ్‌.

. . . గంటల కరెంటు ఇస్తామని ఏఈ హామీతో నిరసన విరమణ

కమ్మర్‌పల్లి, బతుకమ్మ:

కమ్మర్ పల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామ రైతులు వ్యవసాయానికి  త్రి ఫేజ్ విద్యుత్ సరఫరా సక్రమంగా అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. బుధవారం సబ్ స్టేషన్ లో రోజుకి కనీసం ఆరు గంటలు కూడా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం లేదని, దీంతో సాగు చేసిన వరి పంటలు ఎండిపోయి పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉంది, ఈ సమయంలో నీరు అందకపోతే చేతికొచ్చిన పంట నష్ట పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర వ్యవసాయ పనుల కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారని, విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా పంటలు కాపాడుకోవడం కష్టంగా మారిందని వాపోయారు.వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమకు పంట నష్టం జరిగితే కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు పై  సంబంధిత ఏఈ ని ఫోన్ లో నిలదీశారు.వ్యవసాయానికి రోజుకు 12గంటల పాటు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆందోళనకు స్పందించిన ఏఈ ఇక నుంచి రోజుకు 12 గంటల పాటు 3ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించి వెనుదిరిగారు.ఈ కార్యక్రమంలో రైతులు జీవన్, రాజేందర్, రాజశేఖర్, కట్ట రాజు, దీక్షిత్, నరేష్, కుమ్మరి రమేష్, ముత్తన్న, బుచ్చన్న, సురేష్, గంగస్వామి, గంగన్న, రాజారెడ్డి, రజినీకాంత్, సాంబయ్య, రాజన్న, రాజేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Farmers lay siege to the substation

More articles

Latest article