ఇందల్వాయి , బతుకమ్మ :
ఇందల్వాయి మండలం లో దేవి తండా సమీపంలో మోతిలాల్ దాబా వెనకాల ఆటవి శాఖ అనుమతులు లేకుండా చెట్లను నరికిన వ్యక్తికి రూ.7 వేల రూపాయల జరిమానా విధించడం జరిగిందని ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మోహన్ బట్ వెల్లడించారు, ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి లేకుండా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించినందుకు 2002 చట్టం ప్రకారం ఏడు వేల రూపాయల జరిమానా విధించడం జరిగిందని తెలిపారు. దేవి తండా కు చెందిన కుంట షేక్ మజీద్ అనే వ్యక్తి వంట చెరుకు కోసం ప్రభుత్వ అనుమతి లేకుండా నాలుగు చెట్లను నరికి వేయడం జరిగిందన్నారు, విషయం తెలుసుకున్న ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మోహన్ బట్, సెక్షన్ అధికారి ప్రభాకర్, బీట్ ఆఫీసర్ వందన ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వన్యప్రాణులను వేటాడడం, చెట్టు నరకడం 2002వాల్టా చట్టం ప్రకారం నేరమని స్పష్టం చేశారు.

