32.7 C
Hyderabad

నరాల సుధాకర్ ను అభినందించిన దిల్ రాజు

Dil Raju congratulated Narala Sudhakar

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్, బతుకమ్మ:

రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో  మెనేజ్ మెంట్ కమిటీ సభ్యులు గా విజయం సాధించిన నరాల సుధాకర్ ను ప్రముఖ సినీ నిర్మాత లు దిల్ రాజు, శిరీష్ రెడ్డి అభినంధించారు. ఇటీవల నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ కి జరిగిన ఎన్నికల్లో ఈసీ మెంబర్ గా విజయం సాధించిన తాను మర్యాదపూర్వకంగా ప్రముఖ సినీ నిర్మాత లైన దిల్ రాజు శిరీష్ రెడ్డి లను హైదరాబాద్ లో  కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగిందని నరాల సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఎన్నికల్లో విజయం సాధించిన నరాల సుధాకర్ ను దిల్ రాజు ,శిరీష్ రెడ్డి లు ముందు ముందు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు…. తనని ఒక కుటుంబ సభ్యులు గా భావిస్తున్న దిల్ రాజు శిరీష్ రెడ్డి ల కుటుంబ సభ్యులకు సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా నరాల సుధాకర్ అన్నారు. మరింత ఉత్సాహంతో రక్తదాన కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు

More articles

Latest article