. . . ధర్పల్లి సిఐ రామన్
ధర్పల్లి, బతుకమ్మ :
దసరా పండుగ సెలవులలో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్తే అప్రమత్తంగా ఉండాలని ధర్పల్లి సిఐ రామన్ స్పష్టం చేశారు. ఈ మేరకు పండుగ నేపథ్యంలో ప్రజలు పాటించవలసిన జాగ్రత్తలను సూచించారు. తాళం వేసిన ఇళ్ళును టార్గెట్ చేసే దొంగలు ఆట కట్టించేందుకు పౌరులందరూ ఈ కింది నిబంధనలను తప్పక పాటించాలని కోరారు. ఇంటి సమాచారం గోప్యతో ఎవరికి తెలియనివ్వకూడదని, మీరు బయటకు వెళ్తున్న విషయాన్ని ఎట్టి పరిస్థితిలోనూ సోషల్ మీడియాలో ముందుగా పోస్ట్ చేయవద్దని, ప్రయాణం పూర్తి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాతే ఫోటోలు లేదా వివరాలు షేర్ చేయొద్దని సూచించారు. ఆభరణాలు విలువైన వస్తువులను ఇంట్లో బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవడం ఉత్తమమని, పక్కింటి వారికి ఇవ్వద్దని, తాళం వేసి ఊరికి వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్లో ముందస్తుగా సమాచారం అందించాలన్నారు. కాలనీ వాసులందరూ కలిసికట్టుగా ఒక ప్రత్యేక గస్తీ దళాని ఏర్పాటు చేసుకోవడం ద్వారా రక్షణను పెంచుకోవచ్చన్నారు. అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ ప్రయాణ వివరాలను ఇరుగుపొరుగు వారికి తెలిపి ఇంటిని కనిపెట్టి ఉండమని కోరాలన్నారు. అలాగే వారి ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని, ప్రయాణానికి ముందు విద్యుత్ సరఫరా, గ్యాస్ సిలిండర్, రెగ్యులేటర్, ఫ్రిజ్ వంటి వాటిని పూర్తిగా ఆఫ్ చేశారు లేదో సరిచూసుకోండని సూచించారు. ఇంట్లో ఉండే వృద్ధులు, మహిళలు, అపరిచితులు ఎవరైనా వస్తే నమ్మకుండా అప్రమత్తంగా ఉండేలా ముందే చెప్పాలన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, దొంగతనాల నివారణలో భాగస్వామ్యులు కావాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తుందన్నారు. అత్యవసర సమయంలల్లో ప్రజలు ఎప్పుడైనా డయల్ 112 సేవలను సద్వినియోగం చేసుకోవాలని ధర్పల్లి సిఐ రామన్ తెలిపారు
