26.2 C
Hyderabad

183 నివాసాలకు అటవీ శాఖ నోటీసులు

Forest Department issues notices to 183 households.

Must read

📰 Generate e-Paper Clip

. . . పేదల గూళ్ళకు తాఖీదులతో కలకలం

. . . వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని తాఖీదులు

. . . జిల్లా అటవీ శాఖాధికారిదే తుది నిర్ణయం

నిజామాబాద్ , బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలోని పేదలు ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇళ్ళకు అటవీ శాఖ నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. 2004 మొదలుకుని 2022 వరకు నిజామాబాద్ నార్త్ రేంజ్ పరిధిలో రిజర్వు ఫారెస్టు భూమిలో రేకుల షెడ్లు, పూరి గుడిసెలు నిర్మించుకున్న 183 మందికి అటవీ శాఖ నోటీసులు అందజేసింది. గత నాలుగు రోజులుగా నగరంలోని బాబాన్ సాహెబ్ పహడ్, దొడ్డికొమురయ్యకాలనీ, పెయింటర్స్ కాలనీలో ఇళ్ళు నిర్మించుకున్న వారికి అటవీ శాఖ నోటీసులను అందజేయడం కలకలం రేపుతుంది. నిజామాబాద్ నార్త్ రేంజ్ అటవీ అధికారులు సర్వే నంబర్ 1809 పరిధిలోని 8 ఎకరాల 24 గుంటల అటవీ రిజర్వు భూమిలో ఆక్రమణలు వెలిసినట్లు గుర్తించారు. ఇది వరకు చాలాసార్లు చెప్పినా పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది.

Forest Department issues notices to 183 households.

నగర శివారులోని దొడ్డికొమురయ్య కాలనీ, బాబాన్ సాహెబ్ పహాడ్, పెయింటర్స్ కాలనీలో గత ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు ముఖ్యంగా ఇళ్ళు లేని నిరుపేదలకు నివాస స్థలాలను కేటాయించారు. బీడీ కార్మికులకు, దడువాయి కార్మికులకు, హమాలీలకు, చాటావర్కర్లకు, డ్రైవర్లకుచ, పెయింటర్స్ కు చాలా మందికి 2004 నుంచి పట్టాలు ఇచ్చారు. అయితే అక్కడ రెవెన్యూ భూమిలో పట్టాలను కేటాయించారు. వాటిలో చాలామట్టుకు ఆనాడు హౌజింగ్ బోర్డు ద్వారా రాజీవ్ గృహ కల్ప సముదాయాలతో పాటు వ్యక్తిగత ఇళ్ళ నిర్మాణాలు జరిగాయి. అయితే ఆ సమయంలో ఆ ప్రాంతం అటవి శివారు ప్రాంతం కావడంతో చాలా మంది పట్టాదారులు అక్కడ నివాసం ఉండకపోవడంతో అవి అన్యక్రాంతమయ్యాయి. కొందరు కబ్జాదారులు వాటిని కబ్జా చేసుకుని నిర్మాణాలు చేశారు. దాని తర్వాత ఉన్న అటవి భూమిలోకి చొచ్చుకెళ్లి ఏకంగా గుట్టల్లో రాళ్ళు,రప్పలు ఉన్న ప్రాంతాల్లో ఇళ్ళ నిర్మాణాలు చేసుకున్నారు. అప్పటికే ఆర్ఎఫ్ అని బౌండరీలతో సరిహద్దులను నిర్మించినా వాటిని దాటుకుని కబ్జాలు, నిర్మాణాలు చేపట్టారు. దాంతో అటవి శాఖ వాటిని తొలగించాలని నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది.

నిజామాబాద్ నార్త్ రేంజ్ అటవి అధికారులు గత నాలుగు రోజులుగా ఇళ్ళు ఇళ్ళు తిరిగి నోటీసులు అందజేయడం పేదళ్ళో ఆందోళనకు కారణమైంది. ప్రధానంగా ఆనాడు అప్పటి ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములతో పాటు కబ్జా భూముల్లో కష్టాలకు ఓర్చి కట్టుకుని గూడులను కూల్చివేసే విధంగా నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. దాంతో స్థానిక లీడర్లకు ఈ విషయంపై మొర పెట్టుకున్నారు. కానీ సంబంధిత ఇళ్ళ నిర్మాణం, రిజర్వు ఫారెస్టు ప్రాంతంలో ఉండడంతో అది అటవీ శాఖకు మాత్రమే హక్కులున్నాయని వారు చేతులెత్తేశారు. ఈ విషయంలో నిజామాబాద్ నార్త్ రేంజ్ అటవీ శాఖాధికారి సంజయ్ గౌడ్ మాట్లాడుతూ రిజర్వు ఫారెస్టు ప్రాంతంలో 50 గజాల చొప్పున తాత్కాలిక నివాసాలను నిర్మించుకున్న వారికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. దానికి వారు వారం రోజుల్లో సమాదానం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అటవి భూములు దాదాపు 8.24 ఎకరాల అటవీ భూమిలో నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశాం. వారం రోజుల తర్వాత నోటీసుల స్పందనపై జిల్లా అటవీ శాఖాధికారి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

Forest Department issues notices to 183 households.
Forest Department issues notices to 183 households.

More articles

Latest article