. . . కాంగ్రెస్, వామపక్షాల నిరసన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో ఇండియా కూటమి నిర్ణయించిన నిరసన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతుల్లో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అర్హులైన ఓటర్లను దేశవ్యాప్తంగా 13 1/2 కోట్ల ఓట్లను తొలగించటం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులను పరిగణలోకి తీసుకోకుండా ఓటర్లను తొలగించే పద్ధతుల్లో ఎన్నికల ప్రధాన కమిషనర్ నిర్ణయించటం పూర్తిగా బిజెపి నరేంద్ర మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్యని ఆయన అన్నారు. ఇప్పటికే దేశంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో పాటు అనేకమంది విద్యావంతులు, బుద్ధి జీవులు, ప్రజాసంఘాలు, ఎస్ ఐ ఆర్ లో తొలగించిన ఓటర్లను పేర్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని అనేక ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ ఆయన రాజీనామా చేయకపోవడం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయనకు కాపాడాలని చూడటం సరైనది కాదని అందువల్ల ప్రజలు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేంతవరకు పోరాటాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, వెంకటేష్ ,జిల్లా కమిటీ సభ్యులు వేషాల గంగాధర్, సుజాత, విగ్నేష్, నగర కమిటీ సభ్యులు అనసూయమ్మ, అనిత, రాజు ,అబ్దుల్, తదితరులు పాల్గొన్నారు.
