25.5 C
Hyderabad

విద్యార్థి పై దాడి చేసిన ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి

The principal who assaulted the student should be suspended

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రజావాణిలో  జిల్లా కలెక్టర్ కు పి డి ఎస్ యు ఫిర్యాదు

ఇందూర్, బతుకమ్మ:

మోర్తాడ్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి నవీన్ పై పాఠశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ ఏ కారణం లేకుండా విద్యార్థులపై అతి కిరాతకంగా హింసించి వాతలు వచ్చే విధంగా కొట్టడాని అతనిని సస్పెండ్ చేయాలని పిడిఎస్ యూ  జిల్లా అధ్యక్షుడు సురేందర్ డిమాండ్ చేశారు.  సోమవారం జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు నిజామాబాద్ , కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్ మాట్లాడుతూ మోర్తాడ్ బిసి వెల్ఫేర్ హాస్టల్ లో విద్యార్థి నవీన్ ను వాతలు వచ్చే విధంగా.. శరీరం రంగు మారెలా చితిక బాది చెప్పారని మాటలు తిడుతూ కొట్టిన ప్రిన్సిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణ నేర్పడం అంటే చితకబాదడం కాదు కదా అని  విద్యార్థులకు ప్రేమ పూర్వకంగా విద్య నేర్పాలి, వారికి శ్రద్ధ కలిగే విధంగా శిక్షణ కొనసాగాలి అన్నారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ చేయాలి… కానీ ఆసుపత్రికి పాలయ్యే విధంగా కొట్టడం, హింసించడం సమంజసం కాదని వారు తెలిపారు. అలాగే విద్యార్థి చికిత్స కోసం అయ్యే  ఖర్చు అంత ప్రభుత్వమే భరించాలి అని ఆయన తెలిపారు ఈ ఘటనపై విచారణ జరిపి భవిష్యత్తులో ఏ విద్యార్థుల పై ఇలాంటి చర్యలు ఉపాధ్యాయులు చేపట్టకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్ ,ఏరియా అధ్యక్షుడు డి. నిఖిల్ , ప్రధాన కార్యదర్శి ఈ.రాజు , ఏరియా నాయకులు వినోద్ , రాజేష్ , శివ , కుటుంబ సభ్యులు గణేష్ , కళావతి , సురేష్ , స్వప్న పాల్గొన్నారు

The principal who assaulted the student should be suspended
The principal who assaulted the student should be suspended

More articles

Latest article