27.2 C
Hyderabad

సంతోషిమాత ఆలయం పై దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి

The accused who attacked the Santoshi Mata temple must be punished severely

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

సంతోషిమాత ఆలయం పై దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లో గల శ్రీ సంతోషిమాత ఆలయం పై   నిందితుడు మహమ్మద్ అన్సారీ చేసిన దాడిని ఖండిస్తూ ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ వద్ద  హిందూ సంఘాల నాయకులు మహమ్మద్ అన్సారీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందూ దేవాలయాల పై దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. హిందువుల పై జరుగుతున్న దాడులను ఖండించాలన్నారు. హిందూ ఆలయాల పై దాడి అమానుషమని వివరించారు. హిందువులు ఇలా మౌనం పాటించడం వలన ఏమి చేయాలేని పరిస్థితి నెలకొందన్నారు.  సంతోషిమాత ఆలయం పై దాడి చేసిన మొహమ్మద్ అన్సారి అనే నిందితునికి మతిస్థిమితం లేదని సర్టిఫికేట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హిందువులు ఎక్కడ సురక్షితంగా ఉంటారో.. ప్రపంచం అక్కడ శాంతియుతంగా ఉంటుందని పేర్కొన్నారు. మరోసారి హిందూ దేవాలయాల పై దాడికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్  నాయకులు పార్వతి మురళి, హిందూ సంఘాల నాయకులు అడప నవీన్, తాటిపాముల హరీష్, గణేష్, పత్తి నవీన్, వడ్ల రాజు, తోట్ల ప్రవీణ్, నరేందర్, ఎముల గజేందర్, మొద్దుల నర్సయ్య, తమ్మలి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article